బాబు కామెంట్స్‌తో ఏపీలో కలకలం

Chandrababu Indirect Comments on Alliances | AP News Today
x

బాబు కామెంట్స్‌తో ఏపీలో కలకలం 

Highlights

*పొత్తులపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు

Andhra Pradesh: చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయ్. ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు టీడీపీ సింగిల్ గా గెలవడం కష్టమని భావించారా? అందుకే చంద్రబాబు కొత్త వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అన్న చర్చ మీడియా సర్కిల్స్ లో బలంగా విన్పిస్తోంది. పొత్తులపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయా అన్న ప్రచారం మొదలైంది. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లిస్తున్నారు.

ప్రజల్లో వైసీపీ అంత వ్యతిరేకత ఉంటే టీడీపీ సింగిల్‌గా పోటీ చేయొచ్చంటూ టీడీపీని కార్నర్ చేసేలా కామెంట్స్ చేస్తున్నారు. జనం చంద్రబాబు బాబు సభలకు హాజరు అవుతున్నా జై జగన్ అనే అంటున్నారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రేపు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేస్తారోనన్న ఉత్కంఠ రెండు పార్టీల నేతల్లో ఉంది. చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ కోరస్ పలికితే అప్పుడు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందోనన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు జనసేన ఆవిర్భావ సదస్సులో పవన్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా అనుకోవాలా అన్నది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories