Chandrababu: అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. బాధపడను

Chandrababu Hot Comments
x

Chandrababu: అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. బాధపడను

Highlights

Chandrababu: ఈ విషయంలో తాను క్లారిటీగా ఉన్నట్లు తేల్చి చెప్పారు

Chandrababu: ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది.. రాజకీయ పార్టీలన్నీ ఈసారి చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంటే.. ఇటు టీడీపీ, జనసేన పార్టీలు జగన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతోంది.. ఈసారి పొత్తుతో చిత్తు చేస్తామంటూ తేల్చి చెబుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తూనే.. అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళదామని.. ఒకవే ప్రజలు తిరస్కరిస్తే తన నిర్ణయం ఎలా ఉంటుందో తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాను పూర్తిగా క్లారిటీతో ఉన్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్ర్కమించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories