అంతర్జాతీయ నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలు : సజ్జల సంచలన ఆరోపణలు

అంతర్జాతీయ నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలు : సజ్జల సంచలన ఆరోపణలు
x
అంతర్జాతీయ నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలు : సజ్జల సంచలన ఆరోపణలు
Highlights

ఏపీలో ఐటీ సోదాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మూడు లక్షల కోట్ల అప్పుల భారంలో అధికంగా చంద్రబాబు జేబులోకి...

ఏపీలో ఐటీ సోదాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మూడు లక్షల కోట్ల అప్పుల భారంలో అధికంగా చంద్రబాబు జేబులోకి వెళ్లిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలున్నాయని చెప్పారు. వారం రోజుల పాటు జరిగిన దాడుల్లో చంద్రబాబు మాజీ సెక్రటరీ దగ్గరే రెండు వేల కోట్లు దొరికాయని ఇప్పుడు ఆయన దోపిడి లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఐటీ దాడులపై చంద్రబాబు అనుచరవర్గం కిక్కురుమనడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇది చిన్న తీగ మాత్రమే అని విచారణ పూర్తయితే చంద్రబాబు లక్షల కోట్ల భాగోతం బయపడుతుందన్నారు.

మరో వైపు ఐటీ దాడులను రాజకీయం చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోడానికే ఎదుటివాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడులతో టీడీపీకి సంబంధం లేదంటున్నారు. వైసీపీ నేతలు రాజకీయ అపరిచుతులు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు హయంలో యవుతకు తొమ్మిది లక్షల 56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా జగన్ నిజాన్ని ఒప్పుకున్నారని లోకేష్ ట్వీచ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories