
- చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై దాడిని ఖండించిన చంద్రబాబు -ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు - అక్రమాలు బయటపెడితే కక్షగడతారా..?-చంద్రబాబు -ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారు- చంద్రబాబు
చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై దాడిని మాజీ సీఎం చంద్రబాబు ట్వీటర్‌లో ఖండించారు. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా అని ప్రశ్నించారు. ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటీవలె కొందరు మాజీ ఎమ్మెల్యే అనుచరులు చీరాల విలేకరిపై దాడి చేసి గాయపరిచారని కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నింస్తూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తన ఆగ్రాహన్ని వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేసారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? pic.twitter.com/taM49l6g5u
— N Chandrababu Naidu (@ncbn) September 24, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




