అందుకే షర్మిల వివాదం తెరపైకి తెచ్చారు : సీఎం చంద్రబాబు

అందుకే షర్మిల వివాదం తెరపైకి తెచ్చారు : సీఎం చంద్రబాబు
x
Highlights

2019 ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ సమితి సమావేశంలో ...

2019 ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ సమితి సమావేశంలో ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో నేతలకు సూచించారు. టీడీపీ సభ్యత్వ నమోదు, అసెంబ్లీ సమావేశాలు, జయహో బీసీ సభ, ధర్మ పోరాట సభలపైనా చర్చించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా నాయకులకు సూచించారు. రైతు రక్ష, పసుపు కుంకుమ పథకాలపై సమీక్షించారు. సీనియర్లు పలు చోట్ల చురుగ్గా పాల్గొనడం లేదని 'అహం' వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని హెచ్చరించారు. ఇక పెన్షన్ల రెట్టింపుపై ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా చేసేందుకే వైయస్ షర్మిల వివాదం తెరపైకి తెచ్చారని చంద్రబాబు సభలో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories