రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారు

రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు ఎండగట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు ఎండగట్టారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారని, యువత ఉద్యోగావకాశాలను కోల్పోతోందని విమర్శించారు. రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. గత ఏడాది ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనలో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరమంటూ వరుస ట్వీట్లు చేశారు. వైసీపీ పాలనపై దావోస్ లో కూడా పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. గత ఏడాది(2018-19) అత్యధిక పెట్టుబడులు(11.8%) ఆకర్షించి దేశంలోనే ఏపి అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా గత 5ఏళ్లలో (2014-19) దేశవ్యాప్తంగా రూ 7,03,103కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపికి రూ.70వేల కోట్లు వచ్చాయి.అందుకు ఆర్బీఐ తాజా బులెటిన్ వివరాలే ప్రత్యక్ష సాక్ష్యంమంటూ ట్వీట్ చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories