జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారు-చంద్రబాబు

జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారు-చంద్రబాబు
x
Highlights

విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో...

విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మేదరమెట్లలో మాట్లాడిన చంద్రబాబు జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. జగన్‌.. మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు మూడు రాజధానులు అని చెప్తే నవ్వుతారని సెటైర్ వేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్టూరులో ఆయన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఒక్క చాన్స్ అంటే ఓటేశారని, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 9 నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories