విశాఖను ఆర్థిక రాజధాని చేయాలనుకున్నాం

విశాఖను ఆర్థిక రాజధాని చేయాలనుకున్నాం
x
ChandraBabu File Photo
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం జరిగడంపై విచారకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఆమోదం జరిగడంపై విచారకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మండలి ఛైర్మన్ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారనే ఉద్దేశ్యంతోనే మండలి రద్దు తీర్మానం చేయడం విచారకరమన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఓటింగ్ సమయంలోనూ నాటకాలు ఆడారని ఆరోపించారు. అసెంబ్లీలో 121మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మండలి రద్దు తీర్మానానికి 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల కోసం టీడీపీ నేతలు పదవులు త్యాగం చేశారు.

దేశంలో లోక్ సభకు ఉన్న అధికారాలు రాజ్యసభ్యకు కూడా ఉన్నాయని, అలాగే అసెంబ్లీకి ఉన్న అధికారాలు మండలికి కూడా ఉంటాయని, బిల్లుల విషయంలో ఎవరు రాజకీయాలు చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీసీ ఎమ్మెల్యేలంతా నేరస్థుల ముఠా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ తరపున ఎన్నికైనా 86మంది ఎమ్మెల్యేలపై వివిధ రకాల కేసులు ఉన్నాయని తెలిపారు. కేసుకు ఉన్న వారిని వేధావులు అనే స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. సీఎంకు ఎమ్మెల్యేల కేసులపై జవాబు చెప్పే దైర్యం ఉందా అని చంద్రబాబు నిలదీశారు.

టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వైసీపీ నాటకాలు అడుతుందని మండిపడ్డారు. శాసనమండలిలో టీడీపీ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ ఆశాలు చూపించిందని ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడలేదని తెలిపారు. టీడీపీ సిద్ధాంతం అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ కాదు, విశాఖను ఆర్థిక రాజధాని, టెక్నాలజీ హబ్, ఫార్మా, పర్యాటక కేంద్రంగా చేయాలనుకున్నామని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధికి టీడీపీ వ్యతిరేకం కాదన్నారు. కడపకు ఇచ్చినట్లుగానే శ్రీకాకుళం జిల్లాకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని చంద్రబాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ అమోదింస్తూ సంచన నిర్ణయం తీసుకుంది. మండలి రద్దుపై తీర్మానం సీఎం జగన్ శాసనసభలో ఉదయం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సభలో దీనిపై సభ్యులు చర్చించారు. స్పీకర్ తమ్మినేని సీతారమ్ ఓటింగ్ నిర్వహించారు. మండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు ఉన్నట్లు తేల్చారు. వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.రాజ్యాంగంలోని 169 రూల్ ప్రకారం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పికర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ లోనూ, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత సభ పూర్తిగా రద్దు కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories