చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
x
LAKSHMI pARVATI AND CHANDRA BABU FILE PHOTO
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకి నందమూరి...

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకి నందమూరి లక్ష్మీ పార్వతి స్వయంగా హాజరయ్యారు. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.300 మాత్రమే తీసుకున్న ఆయన వేలకోట్ల రూపాయలు ఎలా కూడబెట్టారో విచారణ చరిపించాల్సి ఉందని పిటిషన్ వేశారు. చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని పిల్ లో లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను లక్ష్మీ పార్వతీ కోర్టు ముందుంచారు.

కాగా.. ఈ కేసులో చంద్రబాబుకు ఉన్న స్టే వేకెట్‌ అయిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు రిజిస్టర్‌ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారో విచారించాలని కోరారు. ఈ కేసుపై ఇప్పటిక హైకోర్టు స్టే కొనసాగుతుందని చంద్రబాబు తరపు లాయర్ ఏసీబీ కోర్టు వివరించారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories