Chandrababu Arrest: ఏసీబీ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ..!

Chandrababu Arrest Live Updates
x

Chandrababu Arrest: ఏసీబీ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ..!

Highlights

Chandrababu Arrest: చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్‌ సిద్ధార్థ్ లూథ్రా టీమ్‌ వాదనలు

Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏసీబీ కోర్టు వద్ద కేశినేని నానిని పోలీసులు అడ్డుకున్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. చంద్రబాబును కస్టడీకి కోరుతున్నారు. చంద్రబాబు తరఫు లాయర్లు బెయిల్‌ ఇవ్వాలంటున్నారు. న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ప్రాంగణంలో టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి... చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్‌ సిద్ధార్థ్ లూథ్రా టీమ్‌ వాదనలు విన్పిస్తుంది.

ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సీఐడీ మెమో జారీ చేసింది. చంద్రబాబును ఎప్పుడు అరెస్టు చేశారన్న దానిపై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత.. కోర్టులో హాజరుపర్చడంలో జాప్యం చేశారని పిటిషన్ వేశారు. టీడీపీ పిటిషన్‌‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories