9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
x
Highlights

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. నరసాపురం , ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లను సీఎం...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. నరసాపురం , ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లను సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంట అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి పితాని సత్యనారాయణ, పాలకొల్లు : నిమ్మల రామానాయుడు, ఉండి : శివరామరాజు , నరసాపురం : మాధవనాయుడు, భీమవరం : పులపర్తి రామాంజనేయులు, తణుకు : ఆరిమిల్లి రాధాకృష్ణలను అభ్యర్ధులుగా చంద్రబాబు ప్రకటించారు. తాడేపల్లిగూడెం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు : చింతమనేని ప్రభాకర్ , ఏలూరు : బడేటి బుజ్జి, ఉంగుటూరు : గన్ని వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. మిగిలిన సీట్లను ఈ వారంలోపు ఖరారు చేసే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories