పెమ్మసాని చంద్రశేఖర్: అత్యంత ఖరీదైన కేంద్ర మంత్రి

Chandra Sekhar Pemmasani The Richest Union Minister
x

పెమ్మసాని చంద్రశేఖర్: అత్యంత ఖరీదైన కేంద్ర మంత్రి

Highlights

పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి గెలిచారు. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఈ స్థానం నుండి పెమ్మసాని చంద్రశేఖర్‌ను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది.

Pemmasani Chandra Sekhar: పెమ్మసాని చంద్రశేఖర్ మోడీ మంత్రివర్గంలో అత్యంత సంపన్నుడైన మంత్రి. ఆయన సంపద రూ. 5,700 కోట్లు. మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిగా పెమ్మసాని ఆదివారం నాడు ప్రమాణం చేశారు. 18వ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన 8,390 మంది ఎంపీల్లో ఆయనే అత్యంత సంపన్నుడు.

పెమ్మసానికి కేబినెట్ బెర్త్ వెనుక...

పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి గెలిచారు. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఈ స్థానం నుండి పెమ్మసాని చంద్రశేఖర్‌ను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. పెమ్మసాని గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. టీడీపీ నుంచి మంత్రులైన ఇద్దరిలో ఒకరు పెమ్మసాని. కాగా, మరొకరు క్యాబినెట్ పోస్ట్ దక్కించుకున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై లాంటి 2024 ఎన్నికల్లో పెమ్మసాని ఆ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారని చెబుతారు. దాంతో, ఫలితాలు వెలువడిన వెంటనే పెమ్మసానికి సెంట్రల్ మినిస్టర్ గ్యారంటీ అనే టాక్ పార్టీ వర్గాల్లో మొదలైంది.


పెమ్మసాని తర్వాతే జ్యోతిరాదిత్య సింధియా

పెమ్మసాని చంద్రశేఖర్ మోదీ కేబినెట్ లో అత్యంత సంపన్నుడైన మంత్రి. ఆయన తర్వాతి స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా నిలిచారు. రూ. 484 కోట్లతో పెమ్మసాని తర్వాతి స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా నిలిచారు. జ్యోతిరాదిత్యది రాజవంశ కుటుంబం. ఆయన తండ్రి మాధవరావు సింధియా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. రోడ్డు ప్రమాదంలో మాధవరావు సింధియా మరణించడంతో జ్యోతిరాదిత్య రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. గత టర్మ్ లో కూడా మోదీ కేబినెట్ లో జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి దక్కింది. ఈసారి కూడా ఆయన మరోసారి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. 18వ లోక్ సభలో 10 మంది సంపన్నులు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే ఇందులో పెమ్మసాని చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింధియాలకే మోదీ కేబినెట్ లో చోటు లభించింది.


పెమ్మసాని భార్య ఆస్తుల విలువ రూ. 2,000 కోట్లు

పెమ్మసాని చంద్రశేఖర్ పేరున రూ. 2000 కోట్ల సంపద ఉంది. ఆయన భార్య శ్రీరత్న పేరున కూడా రూ. 2 వేల కోట్ల ఆస్తున్నాయి. కూతురు సహస్ర, కొడుకు అభినవ్ పేరున కలిపి రూ. 500 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో చంద్రశేఖర్ వివరించారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం బుర్రిపాలెం. సినీ నటుడు కృష్ణది కూడా ఇదే ఊరు. 1993 -94 లో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎంసెట్ లో 27వ ర్యాంకు వచ్చింది. దీంతో ఆయనకు ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2000లో అమెరికాకు వెళ్లారు చంద్రశేఖర్. జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఐదేళ్ల పాటు వైద్య విద్యను బోధించారు.

మెడికల్ విద్యార్ధులకు అండగా..

పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య విద్యార్ధులకు అతి తక్కువ ధరకే వైద్య విద్యకు సంబంధించిన నోట్స్ ను అతి తక్కువ ధరకే ఇచ్చేవారు. దీంతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. నర్సింగ్, ఫార్మసీ, లా, బిజినెస్,అకౌంటింగ్ వంటి కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆయన ఓ సంస్థను కూడా ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా పలువురికి ఆయన శిక్షణ అందించారు. మరో వైపు పెమ్మసాని పౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది.

ఎన్ డీ ఏలో తెలుగుదేశం కీలకంగా మారింది. ఈ కూటమిలో బీజేపీ తర్వాత 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మోదీ మంత్రివర్గాన్ని విస్తరిస్తే మరో రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories