హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని దివంగత హరికృష్ణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా హరికృష్ణ ప్రధమ వర్ధంతిలో పాల్గొన్నారు. హరికృష్ణ చిత్రపటం...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని దివంగత హరికృష్ణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా హరికృష్ణ ప్రధమ వర్ధంతిలో పాల్గొన్నారు. హరికృష్ణ చిత్రపటం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ తనయులు, నటులు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ను పరామర్శించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, పలువురు సినీరాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు తన ఇంటికి వెళ్లారు. అందుబాటులో ఉన్న నేతలతో ఏపీలో వరదపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను ఆదుకోవాలని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలకు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories