Tirumala: తిరుమలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం

Chance to Landslides on Tirumala Ghat Road due to Heavy Rains in Tirumala
x

తిరుమలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు * తిరుమల ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ఛాన్స్ * అప్రమత్తమైన టీటీడీ

Tirumala: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లు, వసతి సముదాయాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లోని వర్షపు నీటిని మోటార్లతో బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు ఆలయ సిబ్బంది.

ఇదిలా ఉంటే మరోవైపు భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మొదటి, రెండవ ఘాట్ రోడ్లలో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలంటూ టీటీడీ అధికారులు హెచ్చరించారు. అలిపిరి టోల్‌గేట్ల వద్ద మైకుల ద్వారా పలు సూచనలు చేస్తున్నారు. భారీ వర్షాలతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో భక్తులు వసతి గదులకు పరిమితమవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories