సచివాలయ ఉద్యోగాల ఎంపిక ఎట్టి పరిస్థితుల్లో ఆరోజు కల్లా పూర్తి కావలి..

సచివాలయ ఉద్యోగాల ఎంపిక ఎట్టి పరిస్థితుల్లో ఆరోజు కల్లా పూర్తి కావలి..
x
Highlights

సచివాలయ ఉద్యోగాల ఎంపిక ఎట్టి పరిస్థితుల్లో ఆరోజు కల్లా పూర్తి కావలి..

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం ఇప్పటికే ఐదు జిల్లాల్లో ప్రారంభమైంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మంగళవారం ప్రారంభం కాగా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఎంపికైన వారి జాబితాలను జిల్లాల్లో పోస్టుల వారీగా అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. మంగళవారం రాత్రి.. 105 షార్ట్‌లిస్టులను అందుబాటులో ఉంచారు. అలాగే 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్టును తయారుచేసి ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభమైన చోట కలెక్టర్ల నేతృత్వంలో ఈ ప్రక్రియను 24 నుంచి 26 వరకు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రక్రియ ఆలస్యమవుతున్న జిల్లాల్లో 27వ తేదీ వరకు చెయ్యొచ్చని ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఈనెల 29 కల్లా పూర్తికావాలని అధికారులకు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇదిలావుంటే పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కార్యక్రమానికి అడ్డంకిగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories