పోలవరం నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇస్తోంది : కేంద్ర మంత్రి

పోలవరం నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇస్తోంది : కేంద్ర మంత్రి
x
Highlights

కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణానికి వందశాతం నిధులు ఇస్తోందని గుర్తుచేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో పర్యటించిన...

కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణానికి వందశాతం నిధులు ఇస్తోందని గుర్తుచేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో పర్యటించిన నితిన్‌గడ్కరీ... దాదాపు 17వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, ఆర్వోబీలకు శంకుస్థాపనలు చేశారు... ఆకివీడుకు వచ్చిన గడ్కరీకి ఏపీ మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు.

కాగా నితిన్ గడ్కరీపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు... ఆయన రాజకీయాల్లో కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి, విజన్‌ ఉన్న నాయకుడు అని పొగడ్తల్లో ముంచెత్తారు. మంచి చేసినారు ఏ పార్టీవారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు... దేశంలో గుజరాత్‌ తర్వాత అనంతపురం-అమరావతి రోడ్డు చరిత్రలోనే మిగిలిపోతుందని... అందుకు సహకరించిన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు అయ్యన్నపాత్రుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories