చంద్రబాబుకు కేంద్ర మంత్రి లేఖ

చంద్రబాబుకు కేంద్ర మంత్రి లేఖ
x
Highlights

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నిన్న లేఖ రాశారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నిన్న లేఖ రాశారు. చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకున్న 58 మంది ఇంజనీర్ల దుస్థితిపై జనవరి 30 న చంద్రబాబు లేఖరాసిన తరువాత కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం చంద్రబాబుకు జైశంకర్ లేఖ రాశారు.

ఫిబ్రవరి 1 న 58 మంది ఇంజనీర్లలో 56 మందిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ లేఖలో పేర్కొన్నారు. మొత్తం 56 మంది ఇంజనీర్లు ప్రస్తుతం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఆయన పెర్కొన్నరు. అయితే, ఇద్దరు ఇంజనీర్లు అన్నెం జ్యోతి, దొంతంశెట్టి సత్య సాయికృష్ణ మాత్రం సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికంగా ఉండటంతో ఫిబ్రవరి 1న విమానంలో పంపేందుకు చైనా అధికారులు అనుమతించలేదని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు చైనాలోని వుహాన్ హైటెక్ డెవలప్ మెంట్ జోన్, ఆప్టిక్స్ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్క్ లో స్టార్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజి కంపెనీ లిమిటెడ్ లోనే ఉన్నట్లుగా జైశంకర్ తెలిపారు. వారితో మరియు వారి కుటుంబాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అయన వెల్లడించారు. వారికీ సంబంధించిన హెల్త్ గురించి క్రమం తప్పకుండా సమాచారం అందిస్తామని కేంద్ర మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories