రాజధాని అంశంపై మరోసారి స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాజధాని అంశంపై మరోసారి స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
x
Highlights

అమరావతి రాజధాని అంశంపై మరోసారి స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజధాని ఎక్కడ ఉండాలనేది.. ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని తేల్చేశారు. వైకుండా...

అమరావతి రాజధాని అంశంపై మరోసారి స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజధాని ఎక్కడ ఉండాలనేది.. ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని తేల్చేశారు. వైకుండా ఏకాదశి సందర్బంగా తిరుమలకు విచ్చేసిన కిషన్ రెడ్డి దిగువ తిరుపతిలో జరిగిన సీఏఏ అవగాహన సదస్సులో పాల్గొన్న నేపథ్యంలో దీనిపై మాట్లాడారు. రాష్ట్ర రాజధానిపై కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారాయన. అయితే మూడు రాజధానుల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని.. ప్రభుత్వ విధానం చెప్పిన తరువాత కేంద్రం దృష్టికి తీసుకువస్తే కేంద్రం వైఖరిని కూడా తెలియజేస్తామన్నారు. అంతేకాదు అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు కిషన్‌రెడ్డి. గతంలో చంద్రబాబు అమరావతిని నిర్లక్ష్యం చేశారని విమర్శించిన కేంద్రమంత్రి.. భారత చిత్రపటంలో అమరావతికి చోటు కల్పించేలా తానే కృషి చేశానని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

మరోవైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో అమరావతికి చెందిన రైతులు ఆదివారం.. కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని పద్మానగర్ లోని తన నివాసంలో కలుసుకున్నారు. మహిళా రైతులు కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయనను వేడుకున్నారు. అయితే రాజధాని విషయంలో తాను చేయగలిగింది మాత్రమే చేస్తానని వారికి హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు సైతం రాజధాని అంశంపై కేంద్రం జోక్యం ఉండదని చెప్పారు.

అయితే అమరావతి రాజధాని విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి తదితరులు అమరావతిలోని రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ మాత్రం ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories