'ఏపీ రాజధాని'పై స్పందించిన కిషన్‌రెడ్డి

ఏపీ రాజధానిపై స్పందించిన కిషన్‌రెడ్డి
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి.. మూడు రాజధానుల ప్రతిపాదనపై...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. తుది నిర్ణయం తీసుకున్న తరువాతే బీజేపీ స్పందిస్తుందని అన్నారు. అలాగే రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. రాజధానిపై నిర్ణయం తీసుకున్న తరువాత కేంద్రం ఇన్వాల్వ్ ఉంటుందని అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే అని తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తన తుది నిర్ణయం ప్రకటించిన తరువాతే రాష్ట్రం, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించిన తర్వాత తమ పార్టీ అభిప్రాయం చెబుతామన్నారు. ప్రస్తుతం తమ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదని హితవు పలికారు. తుది నిర్ణయం వచ్చే వరకు బీజేపీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

కాగా, ఏపీలో వికేంద్రీకరణ జరగాలని జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బీసీజీ సంస్థ కూడా ఇవాళ తన నివేదికను సమర్పించనుంది. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించింది. జనవరి చివరి నాటికి హైపవర్‌ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేసి వివిధ పార్టీల అభిప్రాయాలను కోరతారు. ఆ తరువాత క్యాబినెట్ లో చర్చించిన అనంతరం అక్కడ ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన వెంటనే మూడు రాజధానులపై ప్రకటన వస్తుందని సమాచారం. ఈ తతంగం అంతా జరగడానికి మినిమమ్ రెండు నెలలు పడుతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories