తెలుగు రాష్ట్రాల్లో.. రంగంలోకి కరోనా కేంద్ర బృందాలు

తెలుగు రాష్ట్రాల్లో.. రంగంలోకి కరోనా కేంద్ర బృందాలు
x
Highlights

కరోనా వైరస్వీటిలో ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఇదరేసి చొప్పున మూడు బృందాలు వెళ్లనున్నాయి.

కరోనా వైరస్వీటిలో ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఇదరేసి చొప్పున మూడు బృందాలు వెళ్లనున్నాయి.తెలంగాణలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న హైదరాబాద్‌కి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపుతోంది. అలాగే ఇవాళ ఈ బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకొని, అక్కడి ప్రభుత్వాధికారుల్ని కలవనున్నారు. ఈ బృందాలతో కో-ఆర్డినేషన్ చేసుకుంటూ రాష్ట్రాల్లో వైద్యాధికారులు తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

కాగా.. హైదరాబాద్‌కి వచ్చే బృందంలో నెషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి చెందిన డాక్టర్ దీపయాన్ బెనర్జీ , డాక్టర్ జయంత్‌దాస్ ఉంటున్నారు. ఏపీకి వెళ్లే బృందాల సభ్యులు కోల్ కతాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్, పబ్లిక్ హెల్త్ కు చెందిన నలుగురు సభ్యులు సందర్శిస్తారు. ఈ బృందం ఎప్పటికప్పుడు కోరనా రిపోర్టులు తెలుసుకుంటూ.. రాష్ట్ర వైద్య అధికారులకు తగిన సూచనలు చేస్తుంది. కరోనా కేసులు తగ్గేవరకూ ఆయా రాష్ట్రాల్లో ఉండే అవకాశాలున్నాయి. మొత్తం 20 ప్రజారోగ్య బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories