గ్రీన్ జోన్లలో రోడ్డెక్కనున్న రథ చక్రాలు..

గ్రీన్ జోన్లలో రోడ్డెక్కనున్న రథ చక్రాలు..
x
Highlights

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నింస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నింస్తుంది. మే 17వరకు లాక్ డౌన్ పొడిగించినప్పటికీ.. గ్రీన్ జోన్లలో మినహాయింపులు ఇచ్చింది. బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడిపేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి. మిగతా 8 జిల్లాల్లో బస్సులు నడిపేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి సోమవారం నుంచి బస్సులు నడపాలని భావిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏపీలో బస్సులు నడవట్లేదు. ఏప్రిల్ 16 నుంచి నడపాలని అనుకున్న లాక్ డౌన్ పొడిగింపు తో ఆగిపోయింది. టికెట్లు బుక్ చేసుకున్న 10 వేల మందికి మనీ వెనక్కి ఇచ్చారు.

కాగా.. ఇవాళ ( ఆదివారం) ఉదయం ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. ప్రస్తుతానికి అత్యవసర రూట్లలో నడిపే అంశాన్ని ముందుగా చర్చిస్తారు. బస్సుల సంఖ్యను సగానికి తగ్గించి.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ బస్సులను నడపనున్నరు. విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ కావడంతో ఆ జిల్లాలో బస్సులు నడపనున్నారు. సగం మంది ప్రయాణికులతో బస్సులు నడవనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories