టీడీపీ ఎంపీ కేశినేని నానికి కీలక పదవి

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కీలక పదవి
x
టీడీపీ ఎంపీ కేశినేని నాని
Highlights

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక పదవి లభించింది. ఆయనను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేశారు.

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక పదవి లభించింది. ఆయనను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేశారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు, వాటికి సంబంధించిన నిబంధనలు, హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలను కూడా ఈ కమిటీ రివ్యూ చేయనుంది. కాగా రెండోసారి విజయవాడ ఎంపీగా విజయం సాధించారు కేశినేని నాని. ప్రజారాజ్యం పార్టీనుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి విజయవాడ లోక్ సభ టికెట్ సంపాదించారు.. వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ పై మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. అలాగే 2019 లోనూ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికల అనంతరం ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కేశినేని నాని కొట్టిపారేశారు. తాజాగా ప్రతిష్టాత్మక పదవి దక్కడంతో ఆయన బీజేపీకి దగ్గరయ్యారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories