ఏపీని మరోసారి హెచ్చరించిన కేంద్రం.. ఆ ఏడు జిల్లాలతో జాగ్రత్త

ఏపీని మరోసారి హెచ్చరించిన కేంద్రం.. ఆ ఏడు జిల్లాలతో జాగ్రత్త
x
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం మరోసారి హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం మరోసారి హెచ్చరించింది. ఢిల్లీ తబ్లిగి జమాత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, వారికి సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మరికొన్ని జిల్లాలను ప్రకటించింది.

తాజాగా ఏపీలో 7 జిల్లాలను, తెలంగాణలో 3 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రెడ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాలను హాట్ స్పాట్లనగా గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా... జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రెడ్ జోన్ల పరిధిలో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపాదికన సిద్దం చేయాలని కేంద్రం ఆదేశించింది.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా.. 13 మంది కోరుతున్నారు. 334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ కరోనా కేసులు 258 చేరాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఒక్కరోజే 53 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories