సీఎం చొరవతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక.. రూ.3 వేల కోట్లు విడుదల!

సీఎం చొరవతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక.. రూ.3 వేల కోట్లు విడుదల!
x
Highlights

సీఎం జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఖర్చు చేసిన దానిలో రూ.3 వేల కోట్లను విడుదల చేసేందుకు...

సీఎం జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఖర్చు చేసిన దానిలో రూ.3 వేల కోట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకముందు రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ సొమ్ముతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కుడి, ఎడమ కాలువల తవ్వకం పూర్తి చేశారు. అంతేకాదు కొంతమంది నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించారు. అయితే ఈ రూ.5,135.87 కోట్లను విడుదల చేయాలనీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖకు లేఖ రాశారు.. ఈ లేఖను పరిశీలించిన కేంద్ర జల్‌ శక్తి శాఖ.. ముందుగా రూ.3 వేల కోట్లను విడుదల చేయాలనీ కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ శుక్రవారం ప్రతిపాదనలు పంపారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. నవంబర్‌ మొదటి వారంలో నాబార్డ్‌ ద్వారా నిధులు విడుదల చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖకు సమాచారం ఇచ్చింది ఆర్ధిక శాఖ. దీంతో నాబార్డు ద్వారా ఈ మొత్తాన్ని రీయింబర్స్‌ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

అయితే నాబార్డు ద్వారా ఇచ్చేది అప్పుగా పరిగణిస్తారు.. ఎప్పుడైతే ఈ రూ.5,072.47 కోట్లకు అప్పట్లో ఖర్చు చేసిన యూసీ(యుటిలిజషన్ సర్టిఫికెట్)లు సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వమే ఈ అప్పును చెల్లించుకోనుంది. కాగా పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,935.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు (ఏప్రిల్‌ 1, 2014కు ముందు) రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది.. దాంతో ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.11,799.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను ఇప్పటికే కేంద్రం రీయింబర్స్‌ చేయగా మిగిలిన రూ.5,072.47 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈలోపే యూసీ(యుటిలిజషన్ సర్టిఫికెట్)లు సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories