పోలవరానికి రూ.1,850 కోట్లు

పోలవరానికి రూ.1,850 కోట్లు
x
Highlights

గతంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు...

గతంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సొమ్మును సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పరిధిలో ఈ–ఆక్షన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బాండ్లను జారీ చేసింది నాబార్డ్.. దాంతో రూ.1,850 కోట్లు రావడంతో ఆ మొత్తాన్ని

త్వరలోనే పీపీఏకు పంపనుంది.పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. కాగా గతేడాది జులైలో పోలవరానికి నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఆ తరువాత ఇదే ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయడం విశేషం. కాగా, పోలవరం పనులకు ఇటీవల రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ.841.33 కోట్లు ఆదా అయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories