'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకంపై కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు విమర్శలు

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంపై కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు విమర్శలు
x
Highlights

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'వైఎస్సార్ ఆరోగ్యశ్రీ' పథకంపై కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు విమర్శలు కురిపించారు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో...

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'వైఎస్సార్ ఆరోగ్యశ్రీ' పథకంపై కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు విమర్శలు కురిపించారు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ దానికి 'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' అని పేరు పెట్టారని ఆరోపించారు. విశాఖపట్టణంలో బీజేపీ తలపెట్టిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్టణంలోని పాండ్రంకి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.. ఈ సందర్బంగా గ్రామాభివృద్ధిపై చర్చించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో రైల్వే అభివృద్ధికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు అనేదే అవసరం లేని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'ఆయుష్మాన్ భారత్' పథకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, పేదలను ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని.. ఏపీలో కేంద్రం పథకాలను తన పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories