Kurnool: పత్తికొండలో కేంద్ర కరువు బృందం పర్యటన

Central Drought Team Visit To Pattikonda In Kurnool District
x

Kurnool: పత్తికొండలో కేంద్ర కరువు బృందం పర్యటన

Highlights

Kurnool: రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కేంద్ర బృందం

Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. పత్తికొండలో పత్తి, కంది పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరువు బృందంలో నీతిఆయోగ్ సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ అనురాధ బట్నా, జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు, పారిశుధ్య విభాగం అసిస్టెంట్ అడ్వైజర్ సంతోష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్రెటరీ సంగీత్ కుమార్ ఉన్నారు.

పంటల పరిశీలనలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో కేంద్ర కరువు బృందాన్ని టీడీపీ, కాంగ్రెస్ , అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories