జగన్ కేసులో ధర్మానకు షాక్

జగన్ కేసులో ధర్మానకు షాక్
x
ధర్మాన ప్రసాదరావు
Highlights

జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ షాక్ ఇచ్చింది. వాన్‌పిక్ కేసులో మాజీ మంత్రి ధర్మానపై ఉన్న ఆరోపణలపై విచారణ చేపట్టొచ్చని...

జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ షాక్ ఇచ్చింది. వాన్‌పిక్ కేసులో మాజీ మంత్రి ధర్మానపై ఉన్న ఆరోపణలపై విచారణ చేపట్టొచ్చని కోర్టుకు సీబీఐ నివేదించింది. వాన్ పిక్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ధర్మానపై ఆరోపణలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మంత్రి పదవిలో లేకున్నా, ప్రభుత్వం మారినా, అ.ని.శా చట్టం కింద ఉన్న కేసులను విచారించవచ్చని గతంలో సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసిన సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాననూ విచారించాల్సి వుందని స్పష్టం చేశారు. అయితే జగన్ ఆస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసు ఎంతవరకు వచ్చిందని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి బీవీ మధుసూధన్ రావు ఇటీవల సీబీఐని వివరాలు కోరారు. దీనికి సంబంధించి జనవరి 7వ తేదీలోపు తమకు వివరాలు అందించాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories