ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు..

ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు..
x
Highlights

ఆయేషా మీరా కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. 12 ఏళ్ళ తరువాత మళ్లీ ఆయేషా మీరా మృతదేహానికి పోస్ట్ మార్ట్ం చేయాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. మృతదేహాన్ని...

ఆయేషా మీరా కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. 12 ఏళ్ళ తరువాత మళ్లీ ఆయేషా మీరా మృతదేహానికి పోస్ట్ మార్ట్ం చేయాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటడంతో ప్రస్తుతం ఎముకలు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే రీ పోస్టుమార్టం చేస్తే గాయాలను గుర్తించవచ్చని సీబీఐ అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే అయేషా తల్లిదండ్రులకు సీబీఐ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించింది. ఆయేషా మృతదేహానికి కూడా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సీబీఐ కోరిన నేపథ్యంలో మొదట మత పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి తీసుకుని డీఎన్ఏ టెస్టుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories