ఎస్పీవై రెడ్డి ఇంటిలో సీబీఐ సోదాలు!

ఎస్పీవై రెడ్డి ఇంటిలో సీబీఐ సోదాలు!
x
Highlights

నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ఇంట్లో శనివారం అధికారులు సోదాలు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. నంది పరిశ్రమలకు వివిధ బ్యాంక్‌లు భారీగా రుణాలు మంజూరు...

నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ఇంట్లో శనివారం అధికారులు సోదాలు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. నంది పరిశ్రమలకు వివిధ బ్యాంక్‌లు భారీగా రుణాలు మంజూరు చేశాయి. వీటిలోని ఓ బ్యాంకు నంది గ్రూపు సంస్థల యాజమాన్యం మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ అధికారులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పాణ్యం సిమెంట్, నంది పైపుల సంస్థల వ్యవస్థాపక చైర్మన్‌గా,ప్రముఖ పారిశ్రామిక వేత్తగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్‌పీవై రెడ్డికి పేరుంది.

2004, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీగా విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. అయితే ప్రమాణస్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్‌ను ఇవ్వకపోవడంతో జనసేన తరుపున కర్నూల్ ఎంపీగా పోటీ చేశారు. అయితే ప్రచారం మాత్రం చేయలేదు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికీ అక్కడే వైద్య చికిత్సలు పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories