CBI: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం

CBI Key Decision in the Investigation of YS Viveka Murder Case
x

CBI: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం

Highlights

CBI: వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్

CBI: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. హత్యస్థలిలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపింది. ఒత్తిడిలో వైఎస్ వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇప్పటికే తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది. సీబీఐ లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అభిప్రాయపడింది.

నిన్‌హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున సీబీఐ కోర్టును ఆశ్రయించింది. లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ తెలిపింది. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందనను సీబీఐ న్యాయస్థానం కోరింది. సీబీఐ పిటిషన్‌పై న్యాయస్థానం జూన్ 2న విచారణ జరపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories