Punch Prabhakar: పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసిన సీబీఐ

Punch Prabhakar: ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసును జారీ

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 5:16 PM IST
CBI is Ready to Arrest the Punch Prabhakar
X

పంచ్ ప్రభాకర్ (ఫైల్ ఇమేజ్)

Punch Prabhakar: హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పంచ్‌ ప్రభాకర్‌కు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. దీంతో త్వరలోనే ప్రభాకర్‌ను అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై విడివిడిగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story