సీబీఐ రివర్స్ షాక్.. డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు

సీబీఐ రివర్స్ షాక్.. డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు
x
Dr sudhakar(File poto)
Highlights

విశాఖపట్నంలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్‌గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ కేసులో అనూహ్య మలుపు తిరిగింది.

విశాఖపట్నంలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్‌గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ రివర్స్ షాక్ ఇచ్చారు. డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యాన్ని అందజేస్తోన్న మానసిక వైద్యులు రామిరెడ్డిని విధుల నుంచి తప్పించిన సీబీఐ అధికారులు.. ఆయన స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు. రెండో విడతలో ఏకంగా డాక్టర్ సుధాకర్‌పైనే కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన డా. సుధాకర్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా మాట తూలడం, ఓ కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం, తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారని సీబీఐ ఆరోపిస్తూ కేసు పెట్టినట్లు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య వెల్లడించారు.

సుధాకర్ ఘటనలో 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు. అంతకుముందు విచారణను ప్రారంభించిన వెంటనే సీబీఐ అధికారులు కొందరు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories