సీఎం జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురు

సీఎం జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురు
x
Highlights

సీఎం జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది ప్రత్యేక కోర్టు....

సీఎం జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది ప్రత్యేక కోర్టు. వ్యక్తిగత హాజరు మినహాయిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనను ఏకిభావించిన కోర్టు.. హాజరు మినహాయింపు కుదరదని తేల్చి చెప్పింది. కాగా ముఖ్యమంత్రిగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉండగా వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం హోదాలో ఒక్కరోజు ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ తదితర వాటికి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని.. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల రాష్ట్రం నెత్తిన మరింత భారం పడుతుందని జగన్ తరఫు న్యాయవాది కోర్టును వేడుకున్నా కోర్టు అంగీకరించకపోవడం దురదృష్టకరం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories