రాయపాటి విషయంలో టీడీపీ అధిష్టానం ఏమి చేయబోతుంది..!

రాయపాటి విషయంలో టీడీపీ అధిష్టానం ఏమి చేయబోతుంది..!
x
Highlights

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై మంగళవారం సీబీఐ కేసు నమోదయింది. బ్యాంకుల నుంచి రూ. వందల కోట్ల...

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై మంగళవారం సీబీఐ కేసు నమోదయింది. బ్యాంకుల నుంచి రూ. వందల కోట్ల రుణాల తీసుకొని ఎగవేశారని సీబీఐ అధికారులు 120 బి, రెడ్‌విత్‌ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌తోపాటు చైర్మన్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్‌ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. అంతేకాదు హైదరాబాద్, గుంటూరు, బెంగుళూరు ప్రాంతాల్లోని రాయపాటి నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.

అయితే రాయపాటిపై సీబీఐ కేసు నమోదు కావడంతో టీడీపీ ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ కూడా తమ లీడర్లు ఎవరిపైన అయినా సీబీఐ, ఈడీ వంటి తీవ్రమైన కేసులు నమోదతే వారిని ఉపేక్షించకుండా సస్పెండ్ చేసే విధానాన్ని అవలంభిస్తుంది. అందులో భాగంగా గతంలో ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, దీపక్ రెడ్డి లపై కేసులు నమోదు కావడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పడు రాయపాటిని కూడా సస్పెండ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం.. రాయపాటిపై అభియోగాలు మాత్రమే నమోదయ్యాయని.. రుజువు కాలేదని నిర్ధారణ అయితే చర్యలు తప్పవని అంటున్నారు. వాస్తవానికి వాకాటి, దీపక్ రెడ్డి లపై నమోదైన కేసులు కూడా రుజువు కాలేదు. అయినా వారిని సస్పెండ్ చేసింది. గతంలో సస్పెండ్ అయిన దీపక్ రెడ్డి తిరిగి టీడీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కోనసాగుతున్నారు. వాకాటి నారాయణరెడ్డి మాత్రం ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరారు. మరి రాయపాటి విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories