కర్నూలుకు సీబీఐ అదనపు కోర్టు

కర్నూలుకు సీబీఐ అదనపు కోర్టు
x
Highlights

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న రెండో అదనపు సీబీఐ కోర్టును రాయలసీమ ప్రాంతం కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ...

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న రెండో అదనపు సీబీఐ కోర్టును రాయలసీమ ప్రాంతం కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ హైకోర్టు వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఈ కోర్టు పరిధిలో ఉండనున్నాయి.

కాగా ఇప్పటికే తాత్కాలికంగా ఉన్న హైకోర్టును తరలించి రాయలసీమలో శాశ్వత హైకోర్టును పెట్టాలని సీమ వాసులు ఉద్యమాలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. అయితే అధికార వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంతోనే ఏపీ హైకోర్టును తరలిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రం సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.మరో మూడు వారాల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన ఈ కమిటీ త్వరలో రాయలసీమలో కూడా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories