Top
logo

టీటీడీలో దళారీ వ్యవస్థకు చెక్.. అమల్లోకి కొత్త విధానం..

టీటీడీలో దళారీ వ్యవస్థకు చెక్.. అమల్లోకి కొత్త విధానం..
Highlights

టీటీడీలో దళారీ వ్యవస్థకు చెక్.. అమల్లోకి కొత్త విధానం.. టీటీడీలో దళారీ వ్యవస్థకు చెక్.. అమల్లోకి కొత్త విధానం..

పరమ పవిత్రమైన తిరుమలలో నయా చరిత్రకు శ్రీకారం చుట్టారు టీటీడీ అధికారులు. ఇకనుంచి టీటీడీలో దళారీ వ్యవస్థకు చెక్ పడనుంది. కొండపై నగదు లావాదేవీలను నిలిపివేసి టికెట్ కౌంటర్ ల వద్ద స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు. అవినీతి జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి మధ్యవర్తిని నమ్మి భక్తులు మోసపోకుండా ఉండేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. అద్దెగదులు, భక్తుల కాటేజీ కోసం పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నట్టు టీటీడీకి ఫిర్యాదులు అందాయి. దాంతో స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసినట్టు టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి చెప్పారు.

రెండు వారల క్రితం ప్రవేశపెట్టిన ఈ సిస్టం సక్సెస్ ఫుల్ గా సాగుతుందని ఆయన చెప్పారు. త్వరలో క్యాష్ లెస్ చెల్లింపులు జరిపేలా మరింత పారదర్శకంగా ఉండటానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పద్మావతిలో 72 శాతం, సీఆర్ఓ జెనరల్ లో 40 శాతం క్యాష్ లెస్ పేమెంట్ లు జరుగుతున్నాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయితే టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టుగా తమకు కావలసిన టోకెన్లను కౌంటర్ ల వద్ద తీసుకునే అవకాశం ఉందని అలాంటప్పుడు దళారులను ఎందుకు నమ్మవుతామని అంటుంటే మరోవైపు ఈ విధానం బాగానే ఉందని కూడా అభిప్రాయాలు వినబడుతున్నాయి.


లైవ్ టీవి


Share it
Top