జీడిపిక్కల వ్యాపారం చేస్తామని రూ.10 కోట్లకు టోకరా

జీడిపిక్కల వ్యాపారం చేస్తామని రూ.10 కోట్లకు టోకరా
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

చాలా మంది వ్యక్తులు వ్యాపారం చేస్తామంటూ బ్యాంకు లోన్ కోసం అప్లై చేస్తారు. కొన్ని రోజులు వ్యాపారం చేస్తున్నట్టుగానే బ్యాంకర్లను నమ్మిస్తారు. బ్యాంకు...

చాలా మంది వ్యక్తులు వ్యాపారం చేస్తామంటూ బ్యాంకు లోన్ కోసం అప్లై చేస్తారు. కొన్ని రోజులు వ్యాపారం చేస్తున్నట్టుగానే బ్యాంకర్లను నమ్మిస్తారు. బ్యాంకు వాళ్లు లోన్ ఇచ్చిన తరువాత కట్టకుండా అప్పును ఎగ్గొడుతుంటారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సంఘటన జరిగింది.

జీడిపిక్కల వ్యాపారం చేస్తామంటూ కొంత మంది బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత బ్యాంకు అధికారులు తనిఖీ కోసం గోడౌన్‌కు వెళ్లారు. జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్‌ దర్శనమివ్వడంతో గోడౌన్ ను చూసిన అధికారులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. తరువాత షాక్ నుంచి బయటకు వచ్చిన అధికారలు సంబంధిత వ్యాపారులతో పాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనపై స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాల్లోకెళితే అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు రాజమహేంద్రవరంలోని ఇండియన్‌ బ్యాంకులో రూ.10 కోట్లు బిజినెస్ లోన్ పెట్టుకున్నారు. లోన్ అప్రూవల్ చేయడానికి ముందు బ్యాంక్ అధికారులు తనిఖీ చేయగా జీడిపిక్కలను నిల్వ ఉంచిన గోడౌన్ ను చూపించారు. దీంతో అన్నీ సక్రమంగానే ఉన్నాయనుకున్న అధికారులు లోన్ అప్రువల్ చేసారు. రెండు, మూడు నెలల పాటు డబ్బులను సక్రమంగా కట్టిన వ్యాపారులు కొంత కాలంగా వాయిదాలు సక్రమంగా జమ చేయడంలేదు.

దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు గోడౌన్‌ ను తనిఖీకి చేసారు. గోడౌన్‌ అంతా ఖాళీగా ఉండడంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితో పాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్‌ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories