JC Prabhakar Reddy: రెండు పీఎస్‌లలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు

Cases Filed Against Jc Prabhakar Reddy In Yadiki And Tadipatri Police Stations
x

JC Prabhakar Reddy: రెండు పీఎస్‌లలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు నమోదు

Highlights

JC Prabhakar Reddy: IPC సెక్షన్ 3(1) (S) SC/ST సెక్షన్ల కింద తాడిపత్రిలో కేసు నమోదు

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక రవాణా వాహనాల టైర్లలో గాలి తీసి ఇబ్బంది పెట్టారని రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. IPC సెక్షన్ 341, 427, 506 R/W కింద యాడికిలో... IPC సెక్షన్ 3(1) (S) SC/ST సెక్షన్ల కింద తాడిపత్రిలో కేసు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డితో పాటు.. మరికొందరినపై కేసులు నమోదు చేశారు.

కాగా.. తాడిపత్రిలో ఇసుక అక్రమ దారులకు జేసీ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు అక్రమ రవాణాను అడ్డుకోకపోతే.. తానే రంగంలోకి దిగుతానంటూ.. హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాలో రెండు కంపెనీలకు అనుమతి ఉందంటే.. తాను ఇసుక రవాణా వాహనాలు జోలికి వెళ్ళనని.. పేర్కొన్నారు. తాడిపత్రిలో చింతలపల్లి కృష్ణారెడ్డి పేరుతో అక్రమ దందా జరుగుతుందన్నారు. అధికారులు అడ్డుకోకపోతే... తానే రంగంలోకి దిగి.. ఇసుక అక్రమ రవాణా చేసే అన్ని వాహనాలను అడ్డుకొని టైర్లలో గాలి తీసేస్తామన్నారు. తాజాగా.. తమను అడ్డుకున్నారని జేసీపై ఫిర్యాదు చేయగా.. రెండు స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories