కరణం బలరాంపై కేసు నమోదు

కరణం బలరాంపై కేసు నమోదు
x
Highlights

టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా చీరాలఎమ్మెల్యే కరణం బలరాంపై కేసు నమోదయింది. మాజీ కౌన్సిలర్ యడం శివశంకర్ ను దుర్భాషలాడి,...

టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా చీరాలఎమ్మెల్యే కరణం బలరాంపై కేసు నమోదయింది. మాజీ కౌన్సిలర్ యడం శివశంకర్ ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆగస్టు 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో యడం రవిశంకర్‌ ను దుర్భాషలాడినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. కాగా టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావుపై లెక్కకుమించి కేసులు నమోదుకాగా.. ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులను దూషించిన కేసులో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నారు. ఇలా టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకోవడంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories