logo

మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబుపై కేసు నమోదు
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఓ స్థలంలోని సామాన్లు...

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఓ స్థలంలోని సామాన్లు ఖాళీ చేయించారని ఆయనపై అభియోగం నమోదయింది. ఆయనతో పాటు అనుచరులపై కూడా కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉండే అద్దంకి శ్రీకృష్ణ అమరావతి రోడ్డు, డొంకరోడ్డు ప్రాంతాల్లో బాలాజీ టెంట్‌ హౌస్‌ డెకరేకర్స్‌ అండ్‌ లైటింగ్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతను 2008 లో ఏఈఎల్సీ చర్చి కాంపౌండ్‌లోని మహిమ గార్డెన్స్‌లో ఉన్న కర్లపూడి బాబూప్రకాష్‌ కు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని 2021 వరకు అగ్రిమెంట్‌ రాయించుకున్నాడు. అందుకోసం రూ.6.50 లక్షలు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో మూడు షెడ్డులు నిర్మించారు. అయితే 2015లో కర్లపూడి బాబూప్రకాష్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గోడౌన్‌ను ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా విచారణ దశలో ఉండగానే ఆనందబాబు అతని అనుచరులు బలవంతంగా సామాన్లను ఖాళీ చేయించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు మేరకు ఆనందబాబు, కర్లపూడి బాబూప్రకాష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top