ఏపీలో దుమారంగా మారిన పేకాట పాలిటిక్స్

ఏపీలో దుమారంగా మారిన పేకాట పాలిటిక్స్
x
Highlights

* గుడివాడ పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు * పేకాట క్లబ్బులపై ఎప్పటి నుంచో ఆరోపణలు * పేకాట వ్యవహారంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

గుడివాడలో పేకాట శిబిరాలపై దాడులు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎస్ఈబీ చేసిన దాడులు ఏపీ రాజకీయాలలో దుమారం గా మారాయి. ఈ ఎస్ఈబీ దాడుల్లో కొడాలి నాని అనుచరులు పట్టుబడడం ఆసక్తికరంగా మారింది. దీంతో మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేసి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన నాని పేకాట ఆడితే ఏం శిక్ష వేస్తారు ?ఉరిశిక్ష ఏమైనా వేస్తారా అని ప్రశ్నించారు.

ఏపీలో పేకాట పాలిటిక్స్ దుమారంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత గుడివాడ రాజకీయాలు హీటెక్కాయి. మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేసి పేకాట క్లాబ్బులను నిర్వహిస్తున్నారంటూ పవన్‌ ఆరోపణలు చేయడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. తాజాగా గుడివాడ పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేయడంతో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఊతం ఇచ్చినట్లుగా అయింది.

గుడివాడ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నా తాజాగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులతో ఇది మరోసారి బట్టబయలైంది. ఈ దాడుల్లో కార్లు, ఫోన్లు, 42 లక్షల నగదుతోపాటు ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం కృష్ణాజిల్లా గేట్లు దాటి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఇక పేకాట వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాటలో పట్టుబడిన వాళ్ళల్లో నా అనుచరులు ఉంటే ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు. పేకాట ఆడితే ఏం శిక్ష వేస్తారు ? ఉరిశిక్ష ఏమైనా వేస్తారా అంటూ నాని ప్రశ్నలు సంధించారు.

ఇక సీఎం జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గుడివాడలో 'లోన బయట' ఆటలను కొడాలి నాని నిర్వహిస్తన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

మొత్తంగా పేటాక వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది. ఈ వ్యవహారంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయని కొందరు బావిస్తున్నారు. చూడాలి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories