ఉత్సాహ భరితంగా సాగిన రేసింగ్ పోటీలు

ఉత్సాహ భరితంగా సాగిన రేసింగ్ పోటీలు
x
Highlights

మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్ రేసింగ్ లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇబ్రహీంపట్నం ఫెర్రి పవిత్ర సంఘం ఆతిథ్యం ఇవ్వడంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్ రేసింగ్ లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇబ్రహీంపట్నం ఫెర్రి పవిత్ర సంఘం ఆతిథ్యం ఇవ్వడంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోటీలను శనివారం పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు మాట్లాడుతూ.. 2019లో ఆఫ్రోడ్ రేసింగ్ లో భాగంగా బెంగళూరు, కర్ణాటక, కోల్ కత్తా, ఢిల్లీ, ఛండీఘడ్, మైసూర్, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ఫ్రీఫైనల్ ఈవెంట్ ను నేడు విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఫెర్రి వేదికగా ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

క్రీడాహబ్ గా తిరుపతి, విశాఖల్లో కూడా కార్ రేస్ పోటీలు జరిపిస్తాం ఇటువంటి ఈవెంట్లు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా వెన్ను తట్టి ప్రోత్సహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,ఈవెంట్ ఆర్గనైజర్స్ క్లబ్ అధ్యక్షురాలు హేమామాలిని, ఐ.ఎన్.ఎ.సి అధ్యక్షుడు శుభకర్, కూనపరెడ్డి అజయ్, వంశీ, కైతేపల్లి మధన్ ఈవెంట్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories