అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
x
Highlights

ప్రకాశం జిల్లా కారంచేడులో పెను ప్రమాదం తప్పింది. కారంచేడు నుంచి చీరాల వైపు వెళుతోన్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి...

ప్రకాశం జిల్లా కారంచేడులో పెను ప్రమాదం తప్పింది. కారంచేడు నుంచి చీరాల వైపు వెళుతోన్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కారు కాలువలో ఉండటాన్ని గమనించిన స్థానికులు అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు లాగారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గాయపడ్డ వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదాన్నికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. కారు.. కాలువలోకి వెళ్లడం, అందులో నీరు ఉండటం వలన పెను ప్రమాదం తప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ నీరు అధికంగా ఉన్నా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories