గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
x
Guntur Road Accident
Highlights

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గర తుఫాన్ వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత చెందగా.. మరికొందరికి గాయలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణం వాహనం అతివేగమేనని నిర్ధారించినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా.. వాహనంలో ఉన్నావారు ఒకే గ్రామనికి చెందిన వారిగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. వీరంతా కాకుమాను గుంటూరు రూరల్‌ మండంలం ఏటుకూరులో బంధువుల ఇంట జరిగిన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. టవేరా కారు రోడ్డుపై అతివేగంతో వెళ్తూ పల్టీ కొట్టి వాగులోకి దూసుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో నుంచి బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను వివరాలు సమాధుల శ్రీను(50), సమాధుల సీతమ్మ(65), పొగడ్త వీరలక్ష్మి (48) సమాధుల వన్నూరు (55) పొగడ్త రమణ(48) అక్కడిక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories