బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా

Cannabis Use in Pursuit of Beautician
x

బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా

Highlights

Vijayawada: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో మహిళ అరెస్ట్, బ్యూటీషియన్‌గా పనిచేస్తూ చాటుమాటుగా గంజాయి విక్రయం.

Vijayawada: విజయవాడలో బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందాకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్లవల్లేరుకు చెందిన మహిళ బ్యూటీషియన్‌గా పని చేస్తూ చాటుమాటుగా గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. భర్తతో విడిపోయి ప్రియుడితో బ్యూటీషియన్ సహజీవనం చేస్తోంది. గంజాయి కేసులో బ్యూటీషియన్ ప్రియుడు సాదిక్‌ను.. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ జైలుకి తరలించారు. సాదిక్ ఇచ్చిన సమాచారం మేరకు మహిళ నివాసంలో తనిఖీలు నిర్వహించగా 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories