Tuni: రాజధానికి మద్దతుగా తుని లో క్యాండిల్ ర్యాలీ

Tuni: రాజధానికి మద్దతుగా తుని లో క్యాండిల్ ర్యాలీ
x
Highlights

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు కు మద్దతుగా శుక్రవారం రాత్రి తుని లో వైసీపీ శ్రేణులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

తుని: మూడు రాజధానులు కు మద్దతుగా తునిలో క్యాండిల్ ర్యాలీ పాలనా వికేంద్రీకరణ తో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు కు మద్దతుగా శుక్రవారం రాత్రి తుని లో వైసీపీ శ్రేణులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ సినిమా రోడ్డు, పార్క్ సెంటర్, ఎస్ ఏ రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి, బాలికోన్న త పాఠశాల, మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ వైసీపీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులు కు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ రైల్వే స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం వీధి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భం గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రేలంగి రమణ గౌడ్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఉండాలని సంకల్పంతోనే వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబునాయుడు వైఖరిని రాష్ట్ర ప్రజలుగమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతల రమణ, అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి, పోతుల లక్ష్మణ్, ఎస్.కె క్వాజా, లగుడు శ్రీను, పామర్తి మహేష్, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories