కాల్‌ సెంటర్‌ ప్రారంభించిన ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఫిర్యాదులు

కాల్‌ సెంటర్‌ ప్రారంభించిన ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఫిర్యాదులు
x
Highlights

'చేయి చేయి కలుపుదాం.. అవినీతి భూతాన్ని తరిమేద్దాం' అనే నినాదంతో ఏపీలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 14400 కాల్‌...

'చేయి చేయి కలుపుదాం.. అవినీతి భూతాన్ని తరిమేద్దాం' అనే నినాదంతో ఏపీలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 14400 కాల్‌ సెంటర్‌ కూడా ప్రారంభించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. 14400 కాల్‌ సెంటర్‌ ప్రారంభించి 24 గంటలు గడవక ముందే రికార్డు స్థాయిలో 5,100 కాల్స్‌ వచ్చాయి. వీటిలో 283 ఫిర్యాదులను నేరుగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయాలకు పంపించారు.

ఫిర్యాదుల్లో ఎక్కువగా గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి వస్తే తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కడప, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి తక్కువ కాల్స్ వచ్చాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్‌ శాఖల్లో సిబ్బంది లంచం కోసం డిమాండ్‌ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఏసీబీని రంగంలోకి దింపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories