Calendar for primary education: ప్రాధమిక విద్యకు కాలెండర్ విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ

Calendar for primary education: ప్రాధమిక విద్యకు కాలెండర్ విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ
x
Calender for primary education released by ncert for 2020-21
Highlights

Calendar for primary education: కరోనా లేకుండా అన్ని సక్రమంగా నడిస్తే ఈ సమయానికి కల్లా పిల్లలు బిలబిల మంటూ ఉదయాన్నే లేచి, బ్యాగులు, పుస్తకాలు సర్ధుకుని స్కూలుకు వెళ్లేందుకు హైరానా పడుతుండేవారు.

Calendar for primary education: కరోనా లేకుండా అన్ని సక్రమంగా నడిస్తే ఈ సమయానికి కల్లా పిల్లలు బిలబిల మంటూ ఉదయాన్నే లేచి, బ్యాగులు, పుస్తకాలు సర్ధుకుని స్కూలుకు వెళ్లేందుకు హైరానా పడుతుండేవారు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతా తారుమారయ్యింది. స్కూళ్లు లేవు.. పుస్తకాలు లేవు... ఇంటి వద్దే ఉంటూ కరోనా నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచించడడం తప్ప. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని తరగతులకు ఆన్లైన్ క్లాసులు చెబుతుండగా, ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్నవారికి ప్రత్యేక క్యాలెండర్ను విడుదల చేసింది.

ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీరభద్రుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డిఈఓలు ఎన్సీఈఆర్టి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడ‌ద‌ని, విద్యార్థుల‌కు మార్కులు, రాంక్ లు కేటాయించ‌కూడ‌ద‌ని ఆదేశించారు. కాగా ఎన్సీఈఆర్టి ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలెండర్ ను సిద్దం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు ఆ క్యాలండర్ ను పాటించాల‌ని చిన వీర‌భ‌ద్రుడు సూచించారు. కాగా ఆన్లైన్ లెర్నింగ్ ను ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌స్తున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఇంకా పూర్తి అకడమిక్ క్యాలెండర్ రూపొందించ‌లేద‌ని..పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల‌పై ఒత్తిడి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చిన వీరభద్రుడు తెలిపారు. టీచర్లు….సోషల్ మీడియా, టెక్నాల‌జీ సాయంతో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థుల‌కు స‌హ‌కారం అందించాలని చిన వీరభద్రుడు కోరాడు. కాగా తాజాగా ఎన్సీఈఆర్టి… 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను ప్రాథమిక విద్యకు విడుదల చేసింది.

NCERT తాజాగా విడుదల చేసిన క్యాలెండర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లింక్: http://www.ncert.nic.in/pdf_files/Eight_Weeks_AAC_Primary-English.pdf

Show Full Article
Print Article
Next Story
More Stories