ఈనెల 27న ఏపీ మంత్రివర్గ సమావేశం.. రాజధానిపై కీలక నిర్ణయం

ఈనెల 27న ఏపీ మంత్రివర్గ సమావేశం.. రాజధానిపై కీలక నిర్ణయం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల(డిసెంబర్ 27)న సమావేశం అవుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రధానంగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల(డిసెంబర్ 27)న సమావేశం అవుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి వర్గంలో చర్చ ఉంటుందని వెల్లడించారు. ఆ సమావేశంలోనే నివేదిక అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పురోగతిలో ఉన్న భవనాల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని బొత్స స్పష్టం చేశారు. అమరావతి రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. ఆయన కేవలం అసైన్డ్ భూములు, ఇతర భూములు మాత్రమే అన్నారని చెప్పారు.

టిడిపి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని రైతులను దారుణంగా మోసం చేసిందని అన్నారు. రాజధాని ప్రాంతంలో గత టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను వైయస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. నిపుణుల కమిటీ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం చర్చించి పరిశీలిస్తుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై అడిగిన ప్రశ్నలను ఖండించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తవుతాయని బొత్స స్పష్టీకరించారు. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జిఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories